- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
"తెలంగాణలో అకాల వర్షాలు! అల్పపీడన ప్రభావంతో సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు. వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ."

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేస్తూ అప్రమత్తం చేసింది. నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం బలమైన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడన కేంద్రం నుండి మధ్య మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి ఏర్పడి ఉంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది.
ఈ ద్రోణి ప్రధానంగా మధ్య తమిళనాడు, అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు వ్యాపించి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల ప్రభావంతో ఈ అకాల వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. దీనివల్ల సోమవారం, మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో ఒకవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం ఎక్కువగానే నమోదవుతున్నాయి. మార్చి నెల ప్రారంభం కాకముందే దాదాపు 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
నేడు, రేపు వర్షాలు
సోమవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాలో కురిసే అవకాశం ఉంది.
వివిధ ప్రాంతాలలో నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం - నమోదైన ఉష్ణోగ్రత
ఆదిలాబాద్ - 35.3
భద్రాచలం - 36.4
హకీంపేట - 33.7
దుండిగల్ - 33.6
హన్మకొండ - 34
హైదరాబాద్ - 32.9
ఖమ్మం - 35.6
మహబూబ్ నగర్- 36
మెదక్ - 34.4
నల్గొండ - 32
నిజామాబాద్ - 34.4
రామగుండం - 35
పటాన్చెరు - 32.4
రాజేంద్రనగర్ - 33
హయత్ నగర్- 32






