Shah Rukh Khan: బ్రేకింగ్.. నటుడు షారుక్‌ ఖాన్‌కు బెదిరింపులు..

by Rani Yarlagadda |   ( Updated:2024-11-07 09:09:49.0  )
Shah Rukh Khan: బ్రేకింగ్.. నటుడు షారుక్‌ ఖాన్‌కు బెదిరింపులు..
X

దిశ, వెబ్ డెస్క్: నిన్న మొన్నటి వరకూ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) కు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) కు బెదిరింపులు వచ్చాయి. ఆయన్ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడంతో.. ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాల్ వచ్చిన నంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. ఛత్తీస్ గఢ్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఫైజాన్ ఖాన్ అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

రెండ్రోజుల క్రితమే (నవంబర్ 5) ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. బాద్ షా నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్ మెంట్ (Red Chillis Entertainment) కు నిందితుడు కాల్ చేసి.. రూ.50 లక్షలివ్వాలని, లేదంటే షారుఖ్ ను చంపేస్తానని బెదిరించాడు. వెంటనే సంస్థ సిబ్బంది బాంద్రా పీఎస్ (Bandra Police Station)లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నిందితుడి ఆచూకీ కోసం గాలించారు. కాల్ వచ్చిన నంబర్ ఫైజాన్ పేరుపై ఉండటంతో.. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫైజాన్ ను అరెస్ట్ చేసేందుకు మహారాష్ట్ర పోలీసులు రాయ్ పుర్ కు వెళ్లగా.. ఈ కాల్ తో తనకు సంబంధం లేదన్నట్లు తెలుస్తోంది. నవంబర్ 2న తన ఫోన్ పోయిందని, ఆ కాల్స్ ఎవరు చేశారో తనకు తెలియదని ఫైజాన్ చెప్పనట్లు సమాచారం. కాగా.. ఎఫ్ఐఆర్ కాపీ నెట్టింట వైరలవుతోంది.

Advertisement

Next Story

Most Viewed