డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించుకుందాం : ఉప్పల శ్రీనివాస్ గుప్తా

by Batti.Sumithra |

యువతలో మత్తు పదార్థాలపై అవగాహన కల్పించేందుకు ఐవీఎఫ్ బాచుపల్లి డివిజన్ ఆధ్వర్యంలో బాచుపల్లి ఎక్స్‌రోడ్స్‌లో నిర్వహించిన 'సే నో టు డ్రగ్స్–5కే రన్'ను ఉప్పల శ్రీనివాస్ గుప్త జెండా ఊపి ప్రారంభించారు.

డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించుకుందాం : ఉప్పల శ్రీనివాస్ గుప్తా
X

దిశ, వనస్థలిపురం : మత్తు పదార్థాల వినియోగం పై యువతలో అవగాహన పెంచేందుకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) బాచుపల్లి డివిజన్ ఆధ్వర్యంలో ఆదివారం బాచుపల్లి ఎక్స్‌రోడ్స్‌లో నిర్వహించిన 'సే నో టు డ్రగ్స్–5కే రన్' కార్యక్రమాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, అలాంటి యువత డ్రగ్స్ బారిన పడితే కుటుంబంతో పాటు సమాజం కూడా తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. మత్తు పదార్థాలు ఆరోగ్యంతో పాటు విద్య, ఉపాధి, కుటుంబ బంధాలు, భవిష్యత్తును దెబ్బతీస్తాయని పేర్కొంటూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో జీవించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యానికి ప్రజలంతా సహకరించాలని కోరారు.

మత్తు రహిత సమాజ నిర్మాణంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. యువతలో చైతన్యం కల్పించే ఇటువంటి కార్యక్రమాలు గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ 5కే రన్‌లో సుమారు 2,000 మంది యువత, మహిళలు, విద్యార్థులు, వైశ్య సంఘ సభ్యులు, క్రీడాకారులు, స్థానికులు పాల్గొని "Say No to Drugs", "Healthy Youth–Healthy Nation", "Drug Free Society" నినాదాలతో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా తమ సంఘీభావాన్ని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో వంగపల్లి నవీన్ కుమార్, కట్టా రవి కుమార్, కాలువ సుజాత, నరేష్ గుప్తా, సూర్యప్రకాశ్, సురేష్, వినయ్, నాగరాజు, రఘువంశీ తదితరులు పాల్గొన్నారు.

Next Story