Benefits: పండగకెళ్తున్నారా.. చిన్నారులను నానమ్మ-అమ్మమ్మలతో గడపనివ్వండి.. ఎందుకంటే?

by Kodari Anjali |

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది.

Benefits: పండగకెళ్తున్నారా.. చిన్నారులను నానమ్మ-అమ్మమ్మలతో గడపనివ్వండి.. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం కోసం సిటీలో ఉన్న పలువురు జనాలు సొంతూర్లకు బయల్దేరారు. ముఖ్యంగా సంక్రాంతి ఫేస్టివల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫేస్ట్‌కు ఇంటికెళ్లేవారు.. తమ పిల్లల్ని అమ్మమ్మ, నాన్నమ్మలతో గడపనివ్వండి. మీకు తెలియకుండానే చిన్నారులకు బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే క్రమంలో ఇది కూడా ఓ మెట్టని అనుకోండి.

పెద్దల వద్ద పిల్లలు టైమ్ స్పెండ్ చేస్తే అనేక విషయాలు నేర్చుకుంటారు. జ్జాన వచనాలు, పూర్వీకుల సాహిత్యం, భక్తి కథలు(Devotional stories) వంటివి పిల్లలకు చెప్పడం వల్ల.. వారు మంచి మానవత్వం(Good humanity), నైతికత పెరుగుతుంది. అలాగే పూర్వం సంక్రాంతి పండగను పెద్దలు ఎలా సెలబ్రేట్ చేసుకునే వారు అని కూడా వివరిస్తారు. దీంతో పిల్లలకు పండగల ప్రత్యేకతలు ఏంటో తెలుస్తాయి.

అలాగే అమ్మమ్మలు, నానమ్మలతో బాండింగ్ పెరుగుతుంది. జ్జానంతో పాటు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని(Confidence) అందిస్తుంది. ఎప్పుడైనా పిల్లలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నప్పుడు పెద్దలు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని వారంతట వారే ధైర్యం తెచ్చుకుంటారు. భావోద్వేగాలను తట్టుకుని నిలబడుతారు.

పెద్దలతో గడపడం ద్వారా భవిష్యత్తుపై అవగాహన వస్తుంది. మానసిక శక్తి(Mental power)ని పెంచుకోగలుగుతారు. ఫ్యూచర్ లో ఎదుర్కొనే ప్రశ్నలకు ముందుగానే పరిష్కారాలు వెతుక్కోగలుగుతారు. తాత్విక, జీవన పాఠాలు(Life Lessons), సామాజిక బాధ్యతలు(Social Responsibilities), దృక్పథం, విశాలమైన భావాల అవగాహన, ఇతరులతో అనుబంధం పెరగడం, పాత కథలు,జ్జానం(Old stories), సృజనాత్మకత, ప్రే, భద్రత, మైత్రి, ఆరోగ్యకరమైన సంరక్షణ, పరిరక్షణ వంటి విషయాలేన్నో నానమ్మలు, అమ్మమ్మల వద్ద పిల్లలు నేర్చుకోగలుగుతారు.

Next Story