పెద్దేముల్ మండలంలో చిరుత సంచారం.. నిజమే అంటున్న ఆఫీసర్స్

by Dishanational1 |
పెద్దేముల్ మండలంలో చిరుత సంచారం.. నిజమే అంటున్న ఆఫీసర్స్
X

దిశ, పెద్దేముల్: గుర్తుతెలియని ఏదో అడవి జంతువు కుక్కని చంపింది అని భావించిన అధికారులు చిరుతపులి అని నిర్ధారణకు వచ్చారు. వివరాల్లోకి వెళితే పెద్దెముల్ మండలంలోని ఆత్కూరు గ్రామంలో తన సొంత పొలంలో పెంపుడు జంతువు కుక్కను గురువారం రాత్రి జొన్న చేను దగ్గర కట్టేసిన శేఖర్... ఏదో గుర్తు తెలియని అడవి జంతువు చంపేసిందని మొదటగా భావించి అటవీ అధికారులకు సమాచారం అందించాడు. ఆ దిశగా అధికారులు పరిశీలించి కుక్కను చంపిన విధానం రక్త నమూనా, ఫొటోలను పై అధికారులకు పంపగా పెద్దేముల్ మండలంలోని ఇందూరు ఫారెస్ట్ సెక్షన్ లో చిరుతపులి సంచరిస్తున్నట్లుగా అటవీశాఖ అధికారులు నిర్ధారణకి వచ్చారు. శునకంపై దాడి జరిగిన అనంతరం మృతదేహం ఆధారంగా పరిశీలించగా పగ్ మార్క్స్ లభించాయి. ఇదే విషయం ఆధారంగా 'జూ' అధికారులు సైతం చిరుతగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ షాంసుందర్ రావు తదితరులు పర్యటించారు. ఘటనా స్థలంలో మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.


Next Story