డిండి లో చిరుత కలకలం.. భయం భయంగా తండా వాసులు

by Web Desk |
డిండి లో చిరుత కలకలం.. భయం భయంగా తండా వాసులు
X

దిశ, డిండి: మండల పరిధిలోని వీరబోయిన పల్లి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. డిండి మండల పరిధిలోని వీరబోయిన పల్లి గ్రామం శక్రు తండాకు చెందిన సపావట్ నాన్య కుమారుడు పీక్య కు చెందిన పశువులను తన కొట్టంలో కట్టేసేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా కట్టి వేయగా సుమారు రెండు గంటల ప్రాంతంలో ఆరు నెలల లేగదూడను చిరుత దాదాపు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి తినేసింది.

దీంతో చిరుత సంచారం గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల ప్రజలు కూడా భయాందోళనకు గురై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో అధికారి శ్వేత బుధవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. లేగ దూడ ని చంపిన విధానం, అడుగు జాడలు బట్టి చిరుతనే సంచరించినట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజుల నుంచి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చిరుత సంచారం జరుగుతున్నట్లు సమాచారం. కావున రైతులు తమ పశువులను ఇళ్ల దగ్గర కట్టి తీసుకోవడంతో పాటు పొలాలకు ఒంటరిగా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.


Next Story

Most Viewed