నగరంలో చిరుత కలకలం.. లేగ దూడపై దాడి..

by Dishafeatures2 |
నగరంలో చిరుత కలకలం.. లేగ దూడపై దాడి..
X

దిశ, వెల్దండ : వెల్దండ మండల పరిధిలో చిరుత కలకలం రేపుతోంది. చిరుత పులి దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన వెల్దండ మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జక్కుల జంగయ్య రైతు సుమారుగా ఉదయం 5:00 గంటల సమయంలో పొలం దగ్గరకు వెళ్లగా లేగదూడపై చిరుత పులి దాడి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే గ్రామ సర్పంచ్ పాత్లవత్ అంజికి, గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న సర్పంచ్ అంజి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కు సమాచారం చేరవేశాడు.

వెంటనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లలిత ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి, ఇది చిరుత పులి అని నిర్ధారించారు. ఘటనా స్థలంలో పశువైద్యాధికారి శ్యాంసుందర్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ నర్సింహులు, ఫారెస్ట్ ఆఫీసర్ లలిత, గ్రామ సర్పంచ్ అంజి మాట్లాడుతూ గ్రామస్తులు భయాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాలకు ఒంటరిగా వెళ్లకూడదని, మళ్లీ చిరుత పులి సంచరించే సూచనలున్నాయని తెలిపారు. కావున గ్రామస్తులు, రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


Next Story

Most Viewed