- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌ను వెంటనే వీడండి.. భారతీయులకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక!
ఇరాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది. వివిధ కారణాలతో ఇరాన్ వెళ్లి.. అక్కడ ఉన్న భారతీయ పౌరులకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కీలక అడ్వైజరీ జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది. వివిధ కారణాలతో ఇరాన్ వెళ్లి.. అక్కడ ఉన్న భారతీయ పౌరులకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా మార్గాల ద్వారా వెంటనే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. ఈ ఏడాది జనవరి 5న జారీ చేసిన ముందస్తు హెచ్చరికను కొనసాగిస్తూ, ప్రస్తుత పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది.
ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు (PIOs) అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరింది. నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని, స్థానిక వార్తలను నిరంతరం గమనిస్తూ ఉండాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని, తమ పాస్‌పోర్ట్‌లు, ఇతర గుర్తింపు పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
దిదిలా ఉంటే ఇరాన్‌లో చెలరేగిన ఆందోళనలు అత్యంత హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆందోళనల అణచివేతలో దాదాపు రెండు వేల మంది మరణించి ఉండవచ్చని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 12 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రముఖ మీడియా సంస్థ ‘ఇరాన్ ఇంటర్నేషనల్’ ప్రచురించిన కథనం సంచలనంగా మారింది. ఇరాన్ లో నెలకొన్న తాజా పరిస్థితులపై ఐక్య రాజ్య సమితి తీవ్రంగా స్పందించింది.






