- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హార్వర్డ్ వర్సిటీలో లీడర్‌షిప్ కోర్స్ కంప్లీట్.. సీఎం రేవంత్ రెడ్డికి సర్టిఫికెట్ ప్రదానం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం దిక్కింది.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి మరో అరుదైన గౌరవం దిక్కింది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ (Harvard Kennedy School)లో ఆ పాల్గొన్న ‘లీడర్‌షిప్ ఇన్ ది 21st సెంచరీ: కేయాస్, కాన్ఫ్లిక్ట్ అండ్ కరేజ్’ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నేటితో విజయవంతంగా ముగిసింది. శిక్షణను పూర్తి చేసిన సందర్భంగా హార్వర్డ్ అధ్యాపకులు సీఎం రేవంత్ రెడ్డికి సర్టిఫికెట్ ప్రదానం చేశారు. అధికారంలో ఉండగానే ఐవీ లీగ్ (Ivy League) విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికేట్ పొందిన మొదటి భారతీయ సీఎంగా ఆయన రికార్డు సృష్టించారు.
గడ్డకట్టే చలిలోనూ అభ్యాసం..
ఈ ప్రోగ్రామ్‌లో రేవంత్ రెడ్డితో పాటు ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల నుంచి వచ్చిన 62 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జనవరి 25న ప్రారంభమైన ఈ శిక్షణలో సీఎం ఒక సామాన్య విద్యార్థిలా గడిపారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుదీర్ఘంగా తరగతులు జరిగాయి. మసాచుసెట్స్‌లో ప్రస్తుతం వీస్తున్న మంచు తుపాను (Snowstorm Fern) కారణంగా ఉష్ణోగ్రతలు -15 డిగ్రీల నుంచి -24కు పడిపోయాయి. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సీఎం రేవంత్ ఏమాత్రం విరామం తీసుకోకుండా తరగతులకు హాజరయ్యారు. 21వ శతాబ్దంలో ఎదురయ్యే క్లిష్ట సవాళ్లు, అధికార విశ్లేషణ, నాయకత్వ మెళకువలు, సంక్షోభ పరిస్థితులను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై కేస్ స్టడీలు, గ్రూప్ ప్రాజెక్టుల ద్వారా ఆయన శిక్షణ పొందారు.






