Lava నుంచి పెద్ద బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్

by Disha Web Desk 17 |
Lava నుంచి పెద్ద బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: లావా 'లావా ఎక్స్2' పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్ HD+ డిస్‌ప్లేతో, 5000 mAh బ్యాటరీతో, వెనుక-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ ధర రూ. 6,990. మార్చి 12 నుండి Amazon, Lava e-స్టోర్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

స్పెసిఫికేషన్‌లు..

Lava X2 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను, సెల్ఫీ కెమెరా కోసం ముందు భాగంలో వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్‌ని కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో పాటు 2GB RAMతో, Android 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. వెనుక డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 8MP ప్రధాన సెన్సార్‌తో పాటు ఇంకొక కెమెరా 2MP డెప్త్ సెన్సార్‌‌తో వస్తుంది. సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరా ని కలిగి ఉంది. మెమరీ పరంగా గరిష్టంగా 32GB వరకు ఉంటుంది. దీనిని మైక్రో SD కార్డు ద్వారా మరింత పెంచుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ 5000 mAh బ్యాటరీ సపోర్ట్‌తో వస్తుంది. ఇది బండిల్ అడాప్టర్‌తో పూర్తి చార్జ్ కోసం 3.45 గంటలు పడుతుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం 38 గంటల టాక్‌టైమ్‌ను ఒకే చార్జ్‌పై పూర్తి డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌తో 10.5 గంటల యూట్యూబ్ ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.




లావా X2 ధర రూ.6,990. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్ ఇప్పటికే ప్రారంభమైంది. లావా ఎక్స్2 విక్రయానికి ముందు బుక్ చేసుకునే కస్టమర్లకు కంపెనీ రూ.400 తగ్గింపును కూడా అందిస్తోంది. దీంతో ఇది రూ.6,599కి వస్తుంది. ప్రీ-బుకింగ్ మార్చి 11 వరకు కొనసాగుతుంది. ఈ ఫోన్ బ్లూ, సియాన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.




Next Story

Most Viewed