Corona In China: చైనాలో చావు కేకలు.. పంజా విసురుతున్న కరోనా

by S Gopi |   (  Updated:2022-04-19 08:46:23  IST  )

దిశ, వెబ్ డెస్క్: కరోనా పుట్టినిల్లు చైనాలో మరోసారి పంజా విసురుతోంది. ఆదివారంతో పోలిస్తే..Latest News About Corona death in China

Corona In China: చైనాలో చావు కేకలు.. పంజా విసురుతున్న కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా(Corona) పుట్టినిల్లు చైనాలో మరోసారి పంజా విసురుతోంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం కేసుల సంఖ్య రెట్టింపు అయినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన షాంఘైలో కరోనా మరణాల సంఖ్య పెరగడం అక్కడి ప్రజలను భయందోళనకు గురిచేస్తుంది. ఒక్కరోజులోనే 21,400 నమోదు అయినట్లు, అన్ని కేసులు షాంఘైలోనే నమోదైనట్లు గుర్తించారు. దీంతో అక్కడి అధికారులు కరోనా నిబంధనలు విధించారు. దేశంలో కరోనా వేరియంట్ వ్యాప్తి ఆగకుండా కొనసాగుతుందని చైనా(China) నేషనల్ హెల్త్ కమిషనర్ పేర్కొన్నారు. రోజురోజుకి కరోనా కేసులు పెరగడంతో కరోనా ఆంక్షలను మరింత కఠినం చేయాలని జిన్ పింగ్ ప్రభుత్వం ఆదేశించింది.

Next Story