చివరి నిమిషంలో బీఆర్ఎస్ ట్విస్ట్.. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీకి కన్ఫామ్..!

by Malleboina Mahesh |   (  Updated:2026-02-16 02:51:17  IST  )

మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలకు బీఆర్ఎస్ నిర్ణయం షాక్ ఇచ్చింది. పోటీ నుండి బీఆర్ఎస్ తప్పుకోవడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యూహాలు ఫలించలేదు. మొత్తం 34 సభ్యుల బలంతో బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ శ్రేణులు గెలుపు ధీమాతో ఉన్నాయి. సాయంత్రం లోపు అధికారిక ప్రకటన వెలువడనుంది.

చివరి నిమిషంలో బీఆర్ఎస్ ట్విస్ట్.. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీకి కన్ఫామ్..!
X

దిశ, వెబ్ డెస్క్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మొత్తం 66 డివిజన్లలో బీజేపీ 30 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ (14), బీఆర్ఎస్ (9), స్వతంత్రులు (8), ఎంఐఎం (3), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (2) స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. అయితే స్వతంత్రుల మద్దతుతో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్లాన్ చేయగా.. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠం పోటీలో తాము కూడా ఉన్నట్లు ప్రకటించారు. తమది రాజకీయ పార్టీ అని, చివరి వరకు ప్రయత్నం చేస్తామని అనడంతో మేయర్ పీఠం పై మరింత ఉత్కంఠ పెరిగింది.

బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పొత్తు

మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలతో కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కి, కాషాయ పార్టీకి చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలవనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. మొత్తం 9 కార్పోరేటర్లను గెలిచిన ఆ పార్టీకి ఎక్స్ అఫిషియో తో కలిపి 10 ఓట్లు ఉన్న బీఆర్ఎస్.. కరీంనగర్ మేయర్ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ, మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యూహాలు ఫలించకుండా పోయాయి.

బీజేపీదే కరీంనగర్ మేయర్ పీఠం

మేయర్ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించడంతో ఉత్కంఠకు తెర పడింది. మొత్తం 66 స్థానాల్లో 30 కార్పోరేటర్లను గెలుచుకున్న బీజేపీకి ఇద్దరు స్వతంత్రులు, రెండు ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి 34 సభ్యులు బలం ఉంది. దీంతో కరీంగనర్ మేయర్ పీఠం దక్కించుకునేందుకు కావాల్సిన బలం చేకూరడంతో తెలంగాణ చరిత్రలో మొదటి సారి బీజేపీ కరీంనరగ్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు లైన్ క్లియర్ అయింది. దీంతో బండి సంజయ్ వర్గంలో, బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కరీంనగర్ మేయర్ పీఠం పై చివరి నిమిషంలో సమీకరణలు మారుతాయ, బీజేపీనే పీఠం దక్కించుకుంటుందో తెలియాలంటే ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

Next Story