TG: టెన్త్ క్లాస్ విద్యార్థులకు చివరి అవకాశం

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో మార్చి-2026లో జరగనున్న పదో తరగతి, ఓఎస్ఎస్సీ, వృత్తి విద్యా కోర్సుల పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం చివరి అవకాశం కల్పించింది.

TG: టెన్త్ క్లాస్ విద్యార్థులకు చివరి అవకాశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మార్చి-2026లో జరగనున్న పదో తరగతి, ఓఎస్ఎస్సీ, వృత్తి విద్యా కోర్సుల పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం చివరి అవకాశం కల్పించింది. వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థుల కోసం తత్కాల్ స్కీమ్ కింద గడువును ప్రకటిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో ఉత్తీర్ణులు కాని అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ నెల 21 నుండి 27 వరకు రూ.1000 ఆలస్య రుసుముతో హెడ్ మాస్టర్లకు ఫీజు చెల్లించాలని తెలిపారు. ఈ నెల 28న హెచ్ఎం ట్రెజరీలో ఫీజు జమ చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 29 వరకు విద్యార్థుల డేటాను ఆన్ లైన్ లో సమర్పించేందుకు అవకాశం కల్పించారు. మార్చి-2026 పబ్లిక్ పరీక్షలకు రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు మాత్రమే తదుపరి నిర్వహించే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావడానికి అర్హులవుతారు. కాబట్టి, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని సూచించారు.

Next Story