- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు
భారీ వర్షాల కారణంగా రుద్రప్రయాగ్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్ యాత్ర మార్గం స్తంభించింది.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో నిన్న సాయంత్రం నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఈ కారణంగా ప్రసిద్ధ కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో భారీ ల్యాండ్‌స్లైడ్ సంభవించింది. రుద్రప్రయాగ్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోవడంతో, కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్లే వేలాది మంది యాత్రికులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి.
రాత్రంతా అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు నిర్వహించిన 'ఓవర్‌నైట్ ఆపరేషన్' ద్వారా అధికారులు భారీ యంత్రాలను ఉపయోగించి రోడ్డుపై పేరుకుపోయిన మట్టి, రాళ్లను తొలగించారు. బుధవారం ఉదయానికి ఈ మార్గంలో ట్రాఫిక్‌ను అధికారులు పూర్తిగా పునరుద్ధరించడంతో యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు. పర్వత ప్రాంతాలలో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని ఈ ఈ సందర్భంగా యాత్రికులకు జిల్లా కలెక్టర్ సూచించారు.






