- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోవాలో కొత్త జిల్లాగా 'కుశావతీ'.. పరిపాలనా సంస్కరణల్లో కీలక అడుగు!
గోవా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మరో అడుగు ముందుకు వేసింది.

దిశ, వెబ్ డెస్క్: గోవా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మరో అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలో కొత్తగా మూడో జిల్లాను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దక్షిణ గోవా జిల్లాను విభజించి, కొత్తగా 'కుశావతీ' (Kushavati) జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ కొత్త జిల్లాలో నాలుగు తాలూకాలు ఉంటాయని, సుమారు 2.20 లక్షల మంది జనాభాకు ఇది సేవలందిస్తుందని గోవా ప్రభుత్వం వెల్లడించింది.
ముఖ్యంగా ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉన్న గిరిజన జనాభా అవసరాలను తీర్చడం, పాలనను వికేంద్రీకరించడం, సమగ్ర సామాజిక-ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. కొత్త జిల్లా ఏర్పాటుతో ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా ప్రజలకు అందుతాయని గోవా ప్రభుత్వం ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంతో భారత దేశంలో మరో కొత్త జిల్లా ఏర్పాటు అయింది.






