ఫ్రస్టేషన్‌‌లో కేటీఆర్‌కు పిచ్చి‌ పట్టింది.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సెటైర్లు

by Kema Shiva Kumar |

పార్టీలో, ఫ్యామిలీలోని పంచాయతీలతో ప్రస్టేషన్‌‌లో కేటీఆర్‌కు పిచ్చి‌ పట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మండిపడ్డారు.

ఫ్రస్టేషన్‌‌లో కేటీఆర్‌కు పిచ్చి‌ పట్టింది.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సెటైర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీలో, ఫ్యామిలీలోని పంచాయతీలతో ప్రస్టేషన్‌‌లో కేటీఆర్‌కు పిచ్చి‌పట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మండిపడ్డారు. కేటీఆర్‌కు అధికారం పోయినా అహంకారం మాత్రం పోలేదని, మండలిలో కవిత చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇస్తే విచారణ జరిపిస్తామని అన్నారు. మాటలకే పరిమితం కాకుండా కవిత అధికారులకు ఆధారాలు అందించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన సూచించారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. 60 ఏళ్ల కలను సాకారం చేసి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ, కుమారుడు రాహుల్ గాంధీపై కేటీఆర్ అహంకారపూరిత మాటలు మానుకోవాలని డిమాండ్ చేశారు.

పదేళ్లు రాష్ట్రాన్ని ధ్వంసం చేసి, రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టారని, రాష్ట్రానికి రూ.లక్షల కోట్లు అప్పులు చేసి ఆస్తులు పెంచుకున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు చెప్పుతో కొట్టినట్టు తీర్పు ఇచ్చినా సిగ్గు రావడం లేదని అన్నారు. కేటీఆర్ ముందు ఆ బలుపు, అహంకార పూరిత మాటలు మానుకోవాలని, లేకపోతే ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. కేటీఆర్‌ను బయటకు రాకుండా ఎక్కడైనా కట్టేయాలని, లేకుంటే ఎర్రగడ్డ కన్నా పంపించాలన్నారు. ఇలా పబ్లిక్‌లో ఉంటే ఆయన్ని ప్రజలు రాళ్లతో తరిమికొట్టే ప్రమాదం ఉందని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో చేసిన అవినీతిపై సొంత చెల్లెలు కవిత చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పే ధైర్యం కేటీఆర్‌కు లేదన్నారు. కేటీఆర్‌కు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సభలలో ఉండి మాట్లాడే దమ్ములేదని, అందుకే సభ నుంచి పారిపోయి పబ్లిక్‌లో పిచ్చి‌పిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబానికి రాజకీయ భిక్ష కాంగ్రెస్ పార్టీ పుణ్యమే అని, తెలంగాణ తొలి ఉద్యమం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని బల్మూరి వెంకట్ గుర్తు చేశారు.

Next Story