రేపు గవర్నర్‌ను కలవనున్న KTR.. సింగరేణి టెండర్ల ప్రక్రియపై ఫిర్యాదు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-26 09:23:26  IST  )

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ టెండర్ల ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రేపు తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మను కలవనుంది.

రేపు గవర్నర్‌ను కలవనున్న KTR.. సింగరేణి టెండర్ల ప్రక్రియపై ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) టెండర్ల ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నేతృత్వంలోని ప్రతినిధి బృందం రేపు తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma)ను కలవనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులపై వచ్చిన ఆరోపణలపై సాక్ష్యాధారాలతో కూడిన నివేదికను గవర్నర్‌కు అందజేయబోతున్నట్లుగా తెలుస్తోంది

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బంధువు సృజన్ రెడ్డి (Srujan Reddy)కి లబ్ధి చేకూర్చేలా సింగరేణి టెండర్ల నిబంధనలను మార్చారని కేటీఆర్ (KTR) ఆరోపిస్తున్నారు. సుమారు రూ.6 వేల కోట్ల విలువైన టెండర్లలో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను తీసుకువచ్చి, తమకు కావలసిన సంస్థలకే టెండర్లు దక్కేలా చేశారని ఆరోపిస్తున్నారు. సింగరేణి సంస్థకు రావాల్సిన లాభాలను పక్కదారి పట్టించి, ఎన్నికల ఖర్చులు, వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని గవర్నర్‌కు ఇచ్చే ఫిర్యాదులో పేర్కొనబోతున్నట్లుగా తెలుస్తోంది. సింగరేణి టెండర్లప ప్రక్రియలో కుంభకోణంపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి లేదా సీబీఐ (CBI)తో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.

Next Story