కేటీఆర్ అమెరికా టూర్.. ఎవరితోనూ భేటీ కాకుండానే గడిచిన రెండు రోజులు

by Disha Web Desk |
కేటీఆర్ అమెరికా టూర్.. ఎవరితోనూ భేటీ కాకుండానే గడిచిన రెండు రోజులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తీసుకొచ్చే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెరికాకు వెళ్లారు. శనివారం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరానికి చేరుకున్న మంత్రికి టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ఎన్నారైలు భారీగా ఘనస్వాగతం తెలిపారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20న శాన్ డియాగో పారిశ్రామిక వేత్తలతో భేటీ కావల్సి ఉన్నప్పటికీ కాలేదని సమాచారం. ఎవరితో భేటీ కాకుండా రెండ్రోజులపాటు గడిచిపోయిందని విశ్వసనీయ సమాచారం.

ఇదిలా ఉంటే స్వాగతం పలికిన ఎన్నారైలతో మంత్రి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు 'మన ఊరు మన బడి' కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వివరించారు. ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తులు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాయబారులుగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే పెట్టుబడుల ఆకర్షణపై మంత్రి సర్కార్ క్లారిటీ ఇవ్వలేదు. మంత్రి వెంట టీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల, పలువురు ఎన్నారైలు ఉన్నారు.

Next Story