కథ సుఖాంతం.. మళ్లీ ఆరోగ్య శ్రీ సేవలు షురూ

by srinivas |
కథ సుఖాంతం.. మళ్లీ ఆరోగ్య శ్రీ సేవలు షురూ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు మళ్లీ కొనసాగనున్నాయి. పెండింగ్ బకాయిల కోసం ఆరోగ్య శ్రీ సేవలను మూడు రోజులుగా ప్రైవేటు ఆస్పత్రులు నిలిపివేశాయి. దీంతో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ రూ. 203 కోట్లు విడుదల చేసింది. కానీ ఆస్పత్రుల యజమానులు అంగీకరించలేదు. రూ. 800 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చర్చలు జరిపినా సఫలం కాలేదు. దీంతో సీఎస్ జవహర్ రెడ్డిని ప్రైవేటు ఆస్పత్రుల యజమానులు కలిశారు. ఆరోగ్య శ్రీ పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరారు. అయితే రూ. 300 కోట్లు విడుదల చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. దీంతో ఆరోగ్య శ్రీ సేవలను యథావిథిగా కొనసాగించేందుకు ప్రైవేటు ఆస్పత్రుల యజమానులు ఒప్పుకున్నారు. నెట్ వర్క్ ఆస్పత్రుల్లో ఆందోళనను విరమించారు.

Next Story