ఏపీ గ్రామాల్లో టెన్షన్.. టెన్షన్.. పోలీసుల సూచనలు ఇవే..!

by srinivas |
ఏపీ గ్రామాల్లో టెన్షన్.. టెన్షన్.. పోలీసుల సూచనలు ఇవే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో చెలరేగిన అల్లర్లపై పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. గ్రామాలు, పట్టణాల్లో కార్డెన్ సెర్చ్‌లు, ప్లాగ్ మార్చ్‌లు నిర్వహిస్తున్నారు. ఫలితాల సమయం దగ్గరపడుతుండటంతో అణువణువుగా జల్లెడపడుతున్నారు. గ్రామాల్లో ఘర్షణలు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. పలువురు అనుమానితుల ఇళ్లల్లోనూ, సమస్యాత్మక ప్రాంతాల్లో ఫుల్ సోదాలు చేస్తున్నారు. వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. అల్లర్లు చెలరేగకుండా జనాలకు అవగాహన కల్పిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పికెటింగ్ నిర్వహిస్తున్నారు. ఫలితాలు విడుదలయ్యే వరకూ ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఎన్నికల పోలింగ్ సమయంలో జరిగిన చిన్నపాటి మనస్పర్థలను మరిచిపోయి ఇంతకుముందులాగే ఐకమత్యంతో కలిసి మెలిసి ఉడాలని ప్రజలకు సూచిస్తున్నారు. అలాగే రాజకీయ దురుద్దేశాలతో వివాదాలు సృష్టించే వ్యక్తులను గుర్తిస్తున్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Next Story