Atrocious: సొంత తమ్ముడిని చంపిన అన్న.. ఎందుకో తెలుసా?

by srinivas |
Atrocious: సొంత తమ్ముడిని చంపిన అన్న.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఆస్తుల కోసం సొంత తమ్ముడినే అన్న చంపేశారు. ఈ ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలం మూలగుంటపాడులో జరిగింది. గ్రామానికి చెందిన అన్నదమ్ములు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల కోసం గొడవ పడ్డారు. మాటా మాట పెరిగి అన్న విచక్షణ కోల్పోయారు. తమ్ముడు శివశంకర్‌ను దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో తమ్ముడు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శివశంకర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అన్నను అదుపులోకి తీసుకున్నారు. ఆస్తుల కోసం తమ్ముడిని అన్నే చంపడంతో గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు. ఆస్తులు కోసం బంధాలు, బంధుత్వాలు మర్చిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story