- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Valentine's Day: ‘ప్రేమికులు కనిపిస్తే ఎముకలు విరిచేస్తామంటు క్రాంతి సేన వార్నింగ్
ప్రేమ పేరుతో విదేశి కల్చర్‌ను అనుసరిస్తూ.. ప్రేమికుల రోజున పార్కుల్లో సినిమా హాల్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారని మండిపడుతూ.. ఫిబ్రవరి 14న జంటలు ఎక్కడ కనిపించినా కఠినంగా వ్యవహరిస్తామని ఉత్తరప్రదేశ్ కు చెందిన ‘క్రాంతి సేన’ కార్యకర్తలు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 14 ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం (Valentine's Day) జరుపుకుంటారు. అలాగే భారత్ లో కూడా ఈ ప్రేమికుల రోజు కోసం ఎంతమంది ప్రేమికులు వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో ‘క్రాంతి సేన’ కార్యకర్తలు ('Kranti Sena' activists) తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రేమ పేరుతో విదేశి కల్చర్‌ను అనుసరిస్తూ.. ప్రేమికుల రోజున పార్కుల్లో సినిమా హాల్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారని మండిపడుతూ.. ఫిబ్రవరి 14న జంటలు ఎక్కడ కనిపించినా కఠినంగా వ్యవహరిస్తామని ఉత్తరప్రదేశ్ కు చెందిన ‘క్రాంతి సేన’ కార్యకర్తలు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా, చేతిలో లాఠీలు పట్టుకుని వాటికి నూనె రాస్తూ సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేయడం కలకలం రేపుతోంది. కిస్ డే, రోజ్ డే, చాక్లెట్ డే, లవర్స్ డే వంటివి విదేశీ సంస్కృతి అని, వీటిని భారతీయ సమాజం అంగీకరించబోమని వారు స్పష్టం చేశారు.
క్రాంతి సేన కార్యకర్తలు ఇప్పటికే నగరంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లు, పార్కుల యజమానులకు హెచ్చరిక లేఖలను పంపిణీ చేశారు. ఫిబ్రవరి 14న అనుమానాస్పద స్థితిలో జంటలకు చోటిస్తే, యాజమాన్యాలపై కూడా చర్యలు తీసుకుంటామని ఆ లేఖల్లో పేర్కొన్నారు. "మానసంరక్షణ, సంస్కృతి పరిరక్షణ పేరుతో మేము క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తాం. నిబంధనలు అతిక్రమిస్తే ఎముకలు విరిచేస్తాం" అంటూ క్రాంతి సేన తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. కాగా వారి హెచ్చరికలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీంతో తాజా పరిణామాలపై స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ప్రతి సంవత్సరం వాలెంటైన్స్ డే సమయంలో ఇలాంటి హెచ్చరికలు రావడం సాధారణమైనప్పటికీ, ఈసారి లాఠీలతో ప్రదర్శన చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి వ్యవహారం ఏ పరిస్థితులకు దారి తీస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 14 వరకు వేచి చూడాల్సిందే.






