కీలక మ్యాచులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్

by Malleboina Mahesh |

ఐపీఎల్ 2026లో అత్యంత కీలక మ్యాచులో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఢిల్లీ మరియు కోల్‌కతా జట్లకు ఈ విజయం తప్పనిసరి.

కీలక మ్యాచులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్ రేసులో ఉన్న జట్లు విజయమే లక్ష్యంగా చేసుకొని ప్రత్యర్థి జట్లపై తమ సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలో ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో ఢిల్లీ, కలకత్తా జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట ఢిల్లీ జట్టు బ్యాటింగ్ చేయనుంది. పాయింట్ల పట్టికలో ఏడు, ఎనిమిదో స్థానంలో ఉన్న ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిందే. ఈ క్రమంలో ఇరు జట్టు విజయమే లక్ష్యంగా ఆడనుండగా.. ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు రసవత్తరంగా సాగనుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్య రహానే(సి), అంగ్క్రిష్ రఘువంశీ(w), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగి, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(w), నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(సి), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, లుంగి ఎంగిడి, ముఖేష్ కుమార్

Next Story