- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగణనపై అపోహలు వద్దు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
జనాభా గణన మీద ఎటువంటి అపోహలు లేకుండా తమ వివరాలను నమోదు చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : దేశాభివృద్ధికి, భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు జనాభా గణన అత్యంత కీలకమని, ప్రజలు ఎటువంటి అపోహలు లేకుండా తమ వివరాలను నమోదు చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. జనాభా గణనలో పూర్తి వివరాలు వెల్లడిస్తే భవిష్యత్తులో సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారని, అలాంటి అపోహలు పెట్టుకోవద్దని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. "ప్రజలు ఇచ్చే ప్రతి సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుంది. ఏ ప్రాంతంలో ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు ఎక్కడ కల్పించాలనే విషయంలో ప్రభుత్వానికి ఒక స్పష్టత రావడానికి ఈ వివరాలు దోహదపడతాయి తప్ప, పథకాల కోతకు కాదు" అని ఆయన వివరించారు. మే 10 వరకు స్వీయ గణన (Self Enumeration) పోర్టల్ అందుబాటులో ఉండనుండగా.. మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి దశలో భాగంగా ఎన్యూమరేటర్లు నేరుగా ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారు.






