సికింద్రాబాద్‌పై ఆందోళనలకు మద్దతిస్తాం: కిషన్ రెడ్డి

by Gantepaka Srikanth |

సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

సికింద్రాబాద్‌పై ఆందోళనలకు మద్దతిస్తాం: కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్(Secunderabad) మున్సిపల్ కార్పొరేషన్‌(Municipal Corporation)గా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. సికింద్రాబాద్ కోసం జరుగుతున్న పోరాటాలకు మద్దతిస్తామని చెప్పారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు. మరోవైపు. సికింద్రాబాద్‌లో అనూహ్య పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఉదయం నుంచి ఇక్కడ భారీగా పోలీసులు మోహరించారు. నిరసన తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సుదీర్ఘ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ఆనవాళ్లను తుడిచివేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఈ ర్యాలీ నిర్వహించాలని తలపెట్టింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ దీనికి నాయకత్వం వహించారు. 'బచావో సికింద్రాబాద్' పేరుతో నేడు రైల్వే స్టేషన్ నుంచి శాంతి ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.

Next Story