- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో కేజీఎఫ్ చిత్ర యూనిట్ సందడి..
by Satheesh |
దిశ, ఉత్తరాంధ్ర: సోమవారం కేజీఎఫ్ చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది.- Latest Telugu News

X
దిశ, ఉత్తరాంధ్ర: సోమవారం కేజీఎఫ్ చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది. హీరో యష్, సినిమా నిర్వాహకులు విశాఖ చేరుకుని.. ముందుగా సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం హీరో యష్ మాట్లాడుతూ.. తమ సినిమా టిక్కెట్ల విషయంలో తెలుగు రాష్ట్ర సీఎంలు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. కొవిడ్ వలన సినిమా ఇండస్ట్రీ చాలా నష్టాల్లోకి వెళ్ళిందని పేర్కొన్నారు. అందుకే తమ సినిమా భారీ బడ్జెట్‌గా మారిందని.. అభిమానులు కోరుకుంటే కేజీఎఫ్ పార్ట్ 3 కూడా సిద్ధం చేస్తామని అన్నారు. అనంతరం సినిమాలో ట్రేండింగ్ అయిన వైలెన్స్ డైలాగ్‌తో అలరించారు.
Next Story






