- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ
మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొమ్మిది మంది కీలక మావోయిస్టు నేతలు ఛత్తీస్‌గఢ్‌లోని ధంతారి జిల్లా పోలీసుల ఎదుట శుక్రవారం లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.47 లక్షల రివార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టుల పునరావాసం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఫలితాలను ఇస్తున్నాయని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా అనేక మంది మావోయిస్టులు ఆయుధాలను వదిలి జనజీవన శ్రవంతిలోకి వస్తున్నారని చెప్పారు. నక్సలిజంను వీడి సామాన్య జనజీవనాన్ని అవలంబించాలని ఈ సందర్భంగా ఇతర మావోయిస్టులకు ఆయన పిలుపునిచ్చారు. కొంతకాలంగా మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతుండటంతో ఉద్యమ ప్రాబల్యం మరింతగా తగ్గినట్టైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది.






