- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్.. మరో మూడ్రోజులు ఆగాల్సిందే!
రవి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. సీసీఎస్‌లో నమోదైన నాలుగు కేసుల్లో బెయిల్ కోరుతూ ఐబొమ్మ రవి పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం విచారించిన కోర్టు.. శుక్రవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం రవి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐబొమ్మ రవి కేసు(ibomma Ravi case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రవి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. సీసీఎస్‌లో నమోదైన నాలుగు కేసుల్లో బెయిల్ కోరుతూ ఐబొమ్మ రవి పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం విచారించిన కోర్టు.. శుక్రవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం రవి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే.. తెలుగు సినీ పైరసీలో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి (ఇమంది రవి)ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దేశ విదేశాల్లో ఏజెంట్లను, సర్వర్లను ఉపయోగించి ఏకంగా పైరసీ సామ్రాజ్యాన్నే నిర్మించాడు. ఒకానొక దశలో తనను పట్టుకోవడం మీ వల్ల కాదని పోలీసులకే సవాల్ చేశాడు. చివరకు.. ఒక ఈ-మెయిల్ లింక్ ఆధారంగా పోలీసులు నిఘా పెట్టి, రవి హైదరాబాద్‌కు వచ్చినట్లు నిర్ధారించుకుని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రవి పోలీసుల కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నాడు.. కానీ విదేశీ డేటా గురించి సమాధానాలు దాటవేస్తున్నాడు. ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా రవి కోట్లు సంపాదించాడు.






