కేరళ సీఎం పినరయి విజయన్ కీలక నిర్ణయం.. సోషల్ మీడియా బయో మార్పు

by Malleboina Mahesh |   (  Updated:2026-05-03 13:10:31  IST  )

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు సీఎం పినరయి విజయన్ తన సోషల్ మీడియా బయోలో మార్పులు చేశారు. రాష్ట్ర అస్తిత్వానికి ప్రతీకగా ‘కేరళం’ పేరును తన ప్రొఫైల్‌లో చేర్చారు.

కేరళ సీఎం పినరయి విజయన్ కీలక నిర్ణయం.. సోషల్ మీడియా బయో మార్పు
X

దిశ, వెబ్ డెస్క్: ఏప్రిల్ 9న ఒకే విడతలో 140 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాగా ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. అయితే కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభానికి మరి కొద్ది గంటల సమయం ఉన్న తరుణంలో, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సోషల్ మీడియా ఖాతాలలో కీలక మార్పులు చేశారు. రాష్ట్ర అధికారిక పేరును 'కేరళం'గా మార్చాలన్న ప్రభుత్వ ఆకాంక్షను ప్రతిబింబించేలా, ఆయన తన ప్రొఫైల్ బయోలో మార్పులు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న వేళ, రాష్ట్ర అస్తిత్వానికి ప్రాధాన్యతనిస్తూ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆయన తన బయోలో ఉన్న చీఫ్ మినిస్టర్ అనే డిజిగ్నేషన్ తొలగించి " పొలిట్ బ్యూరో సభ్యుడు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కేరళం"గా మార్చుకున్నారు. ఈ మార్పు కేరళ రాష్ట్ర సాంస్కృతిక, భాషాపరమైన అస్తిత్వాన్ని చాటిచెప్పే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న కీలక సమయంలో ముఖ్యమంత్రి తన సామాజిక మాధ్యమ వేదికల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒక బలమైన సంకేతాన్ని పంపినట్లు తెలుస్తోంది. ఓట్ల లెక్కింపునకు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story