- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Keerthi Bhat: కార్తీక్‌తో ఎంగేజ్‌మెంట్ తర్వాత ఆత్మహత్యాయత్నం చేశానంటూ షాకిచ్చిన కీర్తి.. టార్చర్ వల్లనేనా?
బుల్లితెర హీరోయిన్, బిగ్‌బాస్ బ్యూటీ కీర్తి భట్ (Keerthi Bhat)ప్రియుడికి బ్రేకప్ చెప్పి సంచలనం సృష్టించింది.

దిశ, సినిమా: బుల్లితెర హీరోయిన్, బిగ్‌బాస్ బ్యూటీ కీర్తి భట్ (Keerthi Bhat)ప్రియుడికి బ్రేకప్ చెప్పి సంచలనం సృష్టించింది. తెలుగులో పలు సీరియల్స్ ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ బిగ్‌బాస్ షోలోనూ పాల్గొని తన వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయాలను బయటపెట్టి.. అందరికీ దగ్గరైంది. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత 2023లో తన చిన్ననాటి స్నేహితుడు కార్తీక్(Karthik)తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఆ తర్వాత కూడా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరు పలు టీవీ షోల్లో జంటగా పాల్గొన్నారు. మూడేళ్లుగా కలిసే ఉంటున్న కీర్తి, కార్తీక్ మధ్య ఏమైందో తెలియదు కానీ.. సడెన్‌గా విడిపోయినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశారు.
ఇక గత రెండు మూడు రోజుల నుంచి ఒకరిపైఒకరు పలు సంచలన పోస్టులు పెట్టుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తమ అంగీకారంతోనే విడిపోయినట్లు తప్పుగా అర్థం చేసుకోవద్దని నెటిజన్లను కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్థి భట్ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. కార్తీక్‌తో ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత తాను బాధతో ఉరివేసుకున్నట్లు వెల్లడించింది. కానీ అదృష్టం బాగుండి ఎవరో చూసి కాపాడినట్లు చెప్పింది. తన ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టినా.. కార్తీక్ తనకు సెట్ కాలేదని చాలామంది కామెంట్స్ చేశారని.. ఆ సమయంలో చాలా దారుణంగా ఉందని అన్నది.
అంతా డిస్టబ్ అయిపోయా.. అసలు నా లైఫ్‌ని లీడ్ చేయగలనా.. పెళ్లి అయ్యాక ఎలా ఉంటుందో అన్న టెన్షన్‌లో నా వల్ల కాలేదు. ఆ సమయంలో.. కొందరు నా కుటుంబం గురించి కూడా దారుణంగా మాట్లాడారు. యాక్సిడెంట్ కాలేదు.. కానీ నేనే నాటకాలు చేస్తున్నా అని అనడంతో చాలా బాధపడ్డానంటూ చెప్పుకొచ్చింది. ఈ వీడియో చూసిన వారంతా.. జనాల టార్చర్ వల్ల, కార్తీక్ వల్లనే కీర్తి అలా చేసిందని చర్చించుకుంటున్నారు.






