- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Phone Tapping Case: సిట్ నోటీసులపై KCR స్పందన
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) స్పందించారు. ఈ మేరకు సిట్ అధికారులకు కేసీఆర్ లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికలు, నామినేషన్ల పర్వం కొనసాగున్న వేళ రేపటి విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. తనకు కాస్త సమయం కావాలని కోరారు. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్‌లోనే విచారణ చేసుకోవచ్చని తెలిపారు. రేపటి విచారణకు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత విచారణ చేపట్టాలని కోరారు. బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానని అన్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల దర్యాప్తు విషయంలో ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విషయంలోనూ కేసీఆర్ ఇదే తరహాలో వ్యవహరించారు. 2025 జూన్‌లో విచారణకు రావాల్సిందిగా కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే కొన్ని పనుల వల్ల జూన్ 11 వరకూ సమయం కావాలి కేసీఆర్ కోరగా అందుకు కమిషన్ సైతం అంగీకరించింది. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ఇదే తరహాలో గడువు ఇస్తారా? లేక రేపే విచారణ చేస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. KCR Letter






