కేసీఆర్‌కు సిట్ నోటీసులపై కవిత స్పందన.. CM రేవంత్‌పై ఫైర్

by Gantepaka Srikanth |

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR)కు సిట్‌ అధికారులు నోటీసుల ఇచ్చిన విషయం తెలిసిందే.

కేసీఆర్‌కు సిట్ నోటీసులపై కవిత స్పందన.. CM రేవంత్‌పై ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు(Phone Tapping Case)లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR)కు సిట్‌ అధికారులు నోటీసుల ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) స్పందించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేవలం మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఉన్నందునే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ‘ఈ కేసులో సిట్ విచారణ సీరియస్‌గా జరుగడం లేదు. దీనిని ముగించకుండా ప్రభుత్వం డైలీ సీరియల్‌గా సాగదీస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటం అనేది సరైనది కాదు.. దీనిని ఎవరూ సమర్థించరు.. కానీ ఈ కేసులో నేరస్థులకు ప్రభుత్వం తగిన శిక్ష వేసేలా కనిపించడం లేదు. దీనిని ఇంకెన్నాళ్లు సాగదీస్తారో చూద్దాం’ అని కవిత మాట్లాడారు. అంతకుముందు కేటీఆర్‌ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలను పాల్పడుతోందని అన్నారు. ఇది విచారణ కాదని, ప్రతీకారమని, రాజకీయ దురుద్దేశమని విమర్శించారు. సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్‌ అని అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు.

Next Story