- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరీంనగర్‌కు ‘ఆయుష్’ మంజూరు.. పాలనా అనుమతులు జారీ చేసిన కేంద్రం
ఉత్తర తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కరీంనగర్‌లో 50 పడకల ఆయుష్ (ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి) ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కరీంనగర్‌లో 50 పడకల ఆయుష్ (ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి) ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన నిరంతర కృషి ఫలితంగా ఈ ఆసుపత్రి మంజూరైంది. కగా, ఆసుపత్రి ఏర్పాటుకు మొత్తం రూ.15 కోట్లు అంచనా వేయగా.. కేంద్రం ప్రాథమికంగా రూ.7.5 కోట్లను విడుదల చేసింది. 50 పడకల సామర్థ్యంతో నిర్మించే ఈ ఆసుపత్రిలో కాయ చికిత్సకు (20 పడకలు), పంచకర్మ (10), శల్య (10), ప్రసూతి, స్త్రీ రోగ చికిత్సల కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు.ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు, హోమియోపతి, యోగా, నేచురోపతి ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్స అందుబాటులోకి రానుంది.
అదేవిధంగా ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్, నిపుణులైన వైద్యులు, యోగా ట్రైనర్లు, నర్సింగ్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్లు కలిపి భారీ సంఖ్యలో సిబ్బంది సేవలు అందించనున్నారు. ఇక ఆసుపత్రి నిర్మాణానికి తగిన స్థలాన్ని ఎంపిక చేయడం, భవన నిర్మాణం, సిబ్బంది నియామక ప్రక్రియను చేపట్టాలని కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖను రాసింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల కరీంనగర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నేతృత్వంలో స్థల సేకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.






