ఆమె రీ ఎంట్రీ కోసం విశ్వప్రయత్నాలు చేశా : కరణ్ జోహార్

by Dishanational1 |
ఆమె రీ ఎంట్రీ కోసం విశ్వప్రయత్నాలు చేశా : కరణ్ జోహార్
X

దిశ, సినిమా : ఇటీవల విడుదలైన 'జుగ్‌ జుగ్ జీయో' చిత్రంలో సీనియర్ నటి నీతూ కపూర్ రీఎంట్రీతో ఆకట్టుకుంది. అయితే భర్త చనిపోయిన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన నటిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందంటున్నాడు కరణ్. మొదట ఈ ప్రాజెక్టులోకి ఆహ్వానిస్తే ససేమిరా ఒప్పుకొలేదని, దీంతో విశ్వప్రయత్నాలు చేసినట్లు తెలిపాడు. 'నన్ను నమ్మండి. మీరు మళ్లీ వెండితెరపై కనిపిస్తే మీ జీవితం అందంగా ఉంటుంది. మీ పాత రోజుల నుంచి బయటపడతారని ధైర్యంచెప్పి ఒప్పించగలిగాను' అంటూ వివరించిన నిర్మాత.. ఇన్నాళ్ల తర్వాత కూడా తెరపై ఎంతో మనోహరంగా కనిపించి సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఇక వరుణ్ ధావన్, కియారా అద్వానీ, అనిల్ కపూర్, నీతూ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమాకు రాజ్ మెహతా దర్శకత్వం వహించాడు.



Next Story

Most Viewed