- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్-పాక్ మ్యాచ్‌పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
రాబోయే T20 ప్రపంచ కప్ 2026 లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై సోషల్ మీడియా వేదికగా భారీ చర్చనడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రాబోయే T20 ప్రపంచ కప్ 2026 లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ (India-Pakistan match)పై సోషల్ మీడియా వేదికగా భారీ చర్చనడుస్తోంది. ఈ మ్యాచ్ సందిగ్ధతపై టీమిండియా దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడాలా వద్దా అనే అంశం పూర్తిగా ప్రభుత్వం, బీసీసీఐ పరిధిలోని విషయమని, వారు తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. సరిహద్దు అవతల ఉండే క్రికెటర్లలా తాను బాధ్యతారాహిత్యంగా మాట్లాడనని, ఎల్లప్పుడూ తన దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యతనిస్తానని ఆయన ఉద్ఘాటించారు.
ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ (High-voltage match)కు ముందు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బహిష్కరణ హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ వ్యాఖ్యలు (Kapil Dev's comments) ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉగ్రవాదం, క్రీడలు కలిసి సాగవనే భారత ప్రభుత్వ విధానానికి మద్దతుగా ఆయన మాట్లాడటం విశేషం. గతంలో ఆసియా కప్ సమయంలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో, కపిల్ దేవ్ చూపిన ఈ దేశభక్తి, పరిణతి పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.






