- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kangana Ranaut: ఆరేళ్లకే లైంగిక దాడి ఎదుర్కొన్నా.. నటి కంగనా షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: నటి కంగనా రనౌత్, ఇటీవల 'లాక్ అప్' ఎపిసోడ్‌లో, తన ఆరేళ్ల వయసులో లైంగిక..latest telugu news

Kangana Ranaut
దిశ, వెబ్ డెస్క్: నటి కంగనా రనౌత్, ఇటీవల 'లాక్ అప్' ఎపిసోడ్‌లో, తన ఆరేళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించింది. షోలోని కంటెస్టెంట్‌లలో ఒకరైన హాస్యనటుడు మునావర్ ఫరూఖీ తన చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యాడని వెల్లడించిన తర్వాత ఆమె ఈ సంఘటన గురించి మాట్లాడింది.
అటువంటి బాధాకరమైన సంఘటన గురించి మాట్లాడినందుకు అతనిని ప్రశంసిస్తూ.. కంగనా తన అనుభవాన్ని కూడా పంచుకుంది. క్వీన్ నటి తనతో పాటు అదే పట్టణంలో నివసించే ఒక యువకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వెల్లడించింది. "నేను చిన్నదాన్ని, మా ఊరికి చెందిన ఒక చిన్న పిల్లవాడు నన్ను అనుచితంగా తాకుతూ ఉండేవాడు. ఆ సమయంలో, దాని అర్థం ఏమిటో నాకు తెలియదు, కుటుంబం ఎంత రక్షణగా ఉన్నప్పటికీ, పిల్లలందరూ ఇలాంటి దాడులకు గురవుతుంటారు, " అని ఆమె చెప్పింది.
అంతేకాకుండా ఆ బాలుడు తన కంటే మూడు నుండి నాలుగు సంవత్సరాలు మాత్రమే పెద్దవాడని.. బహుశా అతను లైంగికతను అన్వేషిస్తున్నాడని ఆమె గుర్తుచేసుకుంది. "అతను మమ్మల్ని పిలిచి, బట్టలు విప్పి తనిఖీ చేసేవాడు. ఆ సమయంలో మాకు అదేంటో అర్థం కాలేదు," అని ఆమె జోడించారు. ఇలాంటి అనుభవాలను ఎదుర్కొనే వారు అపరాధ భావానికి లోనవుతారని కంగనా పేర్కొంది. ప్రస్తుత సమాజంలో పిల్లలలో ఇది చాలా పెద్ద సంక్షోభంగా ఉందని ఆమె అన్నారు. అయితే మంచి, చెడు టచ్‌ల గురించి పిల్లలకు చెప్పడం ఎంత ముఖ్యమో ఈ సందర్భంగా తెలుస్తుందని ఆమె తెలిపారు.
- Tags
- Kangana Ranaut






