- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోడీ ‘ఇంధన పొదుపు’ పిలుపునకు కమల్ హాసన్ మద్దతు
ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ పిలుపునకు కమల్ హాసన్ మద్దతు తెలిపారు. పెట్రోల్ భారం తగ్గించేందుకు సీఎంలతో సమావేశం కావాలని ప్రధానికి సూచించారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా-ఇరాన్ ఇద్దు కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇంధన పొదుపు, ఆర్థిక పొదుపు చర్యలపై ఇచ్చిన పిలుపునకు ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ (Kamal Haasan) పూర్తి మద్దతు ప్రకటించారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి రక్షించడానికి ఈ తరుణంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జాతీయ బాధ్యతతో వ్యవహరించాలని, వ్యక్తిగత ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. చైనా యుద్ధం, ఆహార కొరత వంటి గత సంక్షోభాల సమయంలో దేశం ఏకతాటిపైకి వచ్చి త్యాగాలు చేసిన స్ఫూర్తిని గుర్తు చేస్తూ.. ప్రధాని మోడీ ప్రతిపాదించిన పొదుపు చర్యలను పాటించాల్సిన బాధ్యత పౌరులపై ఉందని తెలుపుతూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
అందులో ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుండే త్యాగాలు ఆశించకుండా ప్రభుత్వాలు కూడా తమ వంతు బాధ్యతను పంచుకోవాలని కమల్ హాసన్ స్పష్టం చేశారు. ఈ ఆర్థిక భారాన్ని ప్రజలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా మోయాలని.. సామాన్యులకు ఊరట కల్పించేందుకు బస్సు, మెట్రో, రైలు రవాణా ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కమల్ హాసన్ విజ్ఞప్తి చేశారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ చౌకగా లభిస్తే ప్రజలు సొంత వాహనాలను పక్కనబెట్టి ఇంధనాన్ని ఆదా చేస్తారని సూచించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌లపై ఉన్న 'వ్యాట్' (VAT) పన్నులను తగ్గించేలా సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి, ప్రధాని మోడీ తక్షణమే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక జాతీయ స్థాయి అత్యున్నత సమావేశాన్ని (National Summit) ఏర్పాటు చేసి చొరవ చూపాలని ఈ సందర్భంగా కమల్ హాసన్ కోరారు.






