- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kalvakuntla Kavitha: ఆ ప్రకటనలన్నీ ఉత్తి ఆర్భాటమే
భూ భారతి కాస్త భూ హారతిగా మారిపోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: భూ భారతి కాస్త భూ హారతిగా మారిపోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అత్యంత లోప భూయిష్ణంగా రూపొందించిన సాఫ్ట్ వేర్‌ను ఉపయోగించుకొని కొందరు కేటుగాళ్లు ఏకంగా పోర్టల్‌కే కన్నమేశారని ఆరోపించారు. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా రూ.42 కోట్లు కొల్లగొట్టారని.. ఇవి రెండు జిల్లాల్లో వెలుగు చూసిన అక్రమాలు మాత్రమేనని.. గుట్టుచప్పుడు కాకుండా అక్రమాలు మింగింది ఇంకా ఎంత ఉన్నదోనని అనుమానం వ్యక్తం చేశారు. ధరణిని బంగాళాఖాతంలో పడేసి పటిష్టమైన భూ భారతి చట్టం తీసుకువచ్చామని సీఎం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలన్నీ ఉత్తి ఆర్భాటమేనని తేలిపోయిందని పేర్కొన్నారు. ధరణిని బంగాళాఖాతంలో పడేయడంలో చూపించిన శ్రద్ధలో పదో వంతు అయినా భూ భారతి సాఫ్ట్‌వేర్ రూపొందించడంపై పెట్టి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదని ఎద్దేవా చేశారు. ధరణిలో ఆడిటింగ్ ఆప్షన్ లేదని.. భూ భారతిలో ఈ ఆప్షన్ తెచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారని.. కానీ అది కూడా అంతంత మాత్రమేనని తాజా అక్రమాలతో తేలిపోయిందని పేర్కొన్నారు. ప్రచార ఆర్భాటాలు మాని రైతులకు మేలు చేసేలా భూ భారతిని సంస్కరించాలని.. అక్రమాలు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకొని అక్రమాలకు అవకాశం లేకుండా పోర్టల్‌లో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు.






