Allu Arjun : అల్లు అర్జున్ కు జూ.ఎన్టీఆర్ ఫోన్

by M.Rajitha |
Allu Arjun : అల్లు అర్జున్ కు జూ.ఎన్టీఆర్ ఫోన్
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ను జూ.ఎన్టీఆర్(Jr NTR) ఫోన్లో పరామర్శించారు. తాను ముంబయి(Mumbai)లో వార్-2(War-2) సినిమా షూటింగ్ లో ఉండటం వలన స్వయంగా రాలేకపోయానని, హైదరాబాద్ రాగానే వచ్చి కలుస్తానని బన్నీకి తెలిపినట్టు సమాచారం. థియేటర్ ఘటన దురదృష్టకరం అని, తామంతా మీకు తోడుగా ఉంటామని అల్లు అర్జున్ కు జూ.ఎన్టీఆర్ ధైర్యం చెప్పినట్టు తెలుస్తోంది. కాగా సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద పుష్ప-2 ప్రీమియిర్ షో(Pushpa-2 Premiere Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‌ ను నిన్న చిక్కడపల్లి పోలీసులు(Chikkadpally Police) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నాంపల్లి కోర్టు (Nampally Court) బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించగా.. చంచల్ గూడ జైలుకు తరలించారు. అప్పటికే అల్లు అర్జున్.. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు కొట్టి వేయాలని హైకోర్టు(High Court)లో క్వాష్ పిటిషన్‌(Quash Pitition)దాఖలు చేయగా.. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని తెలిపిన కోర్ట్, మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే అప్పటికే బన్నీని పోలీసులు జైలు(ChanchalGuda Jail)కు తరలించగా.. విడుదల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగి, నిన్న రాత్రి జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు నేటి ఉదయం విడుదలయ్యి ఇంటికి వచ్చాడు.

Advertisement

Next Story