'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా గురించి మాట్లాడను.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
ది కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడను.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన 'ది కాశ్మీర్ ఫైల్స్' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు ఈ చిత్రంపై స్పందిస్తున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం ఎన్ని ప్రశంసలు అందుకుందో.. అంతకుమించి విమర్శలు ఎదుర్కొంది.

తాజాగా.. ఈ చిత్రంపై స్పందించడానికి బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాన్ అబ్రహం అసహనం వ్యక్తం చేశాడు. తన 'అటాక్' మూవీ ప్రమోషన్‌లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్‌ను.. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూశారా అని ప్రశ్నించగా.. 'ఆ సినిమా నేను చూడలేదు.. దాని గురించి చెప్పడానికి ఏమీలేదు. ఆ ప్రశ్న ఎందుకు అడుగుతారు అంటూ అసహనం వ్యక్తం చేస్తూ.. ఆ సినిమా గురించి ఎందుకు మాట్లాడాలని ప్రశ్నించారు. దీనితో జాన్ ఎందుకు అంతా సీరియస్‌గా స్పందించాడని అభిమానులు చర్చించుకుంటున్నారు.



Next Story

Most Viewed