- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాబ్ క్యాలెండర్ విడుదల.. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే..?
ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు విద్యా, హోమ్, గ్రూప్ 1 & 2 శాఖల్లో భారీగా కొలువుల భర్తీ!

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది కానుకగా నిరుద్యోగుల కోసం 2026 జాబ్ క్యాలెండర్ (Job Calendar)ను విడుదల చేసింది. ఇందులో 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వివిధ శాఖల వారీగా స్పష్టమైన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం, అత్యధికంగా విద్యా శాఖలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 15న విడుదలయ్యే నోటిఫికేషన్ ద్వారా పాఠశాల మరియు ఇంటర్ విద్యలో 3,004 పోస్టులను, మే 15న ఉన్నత విద్యలో 1,500 పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే హోమ్ శాఖలో 2,778 పోస్టుల భర్తీకి ఆగస్టు 15న గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ నోటిఫికేషన్ల ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల వివరాలు
తాజా జాబ్ క్యాలెండర్‌లో ప్రభుత్వంలోని కీలక విభాగాలైన గ్రూప్-1లో 91 పోస్టులు, గ్రూప్-2లో 750 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ విభాగంలో 503 పోస్టులకు, ఇతర శాఖల్లోని సుమారు 1,434 ఖాళీలకు నోటిఫికేషన్లు రానున్నాయి. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, ప్రజా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉద్యోగాల విప్లవానికి తెరలేపింది. నిర్దేశిత సమయానికి పరీక్షలు నిర్వహించి, అర్హులైన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం భరోసా ఇవ్వడంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌లో నిమగ్నమయ్యారు.






