అత్యంత వేగవంతమైన స్మార్ట్ వాచ్ 'Falster Gen 6'

by Disha Web Desk 17 |
అత్యంత వేగవంతమైన స్మార్ట్ వాచ్ Falster Gen 6
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాచ్, జ్యువెలరీ బ్రాండ్ స్కాగెన్ కంపెనీ కొత్త స్మార్ట్ వాచ్ 'ఫాల్‌స్టర్ జెన్ 6'ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 4100+ ప్లాట్‌ఫారమ్ ద్వారా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ వేగవంతంగా పనిచేస్తుందని, అలాగే సరి కొత్త అప్‌డేట్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. దీని ధర రూ.21,995. "స్కాగెన్ నుండి వచ్చిన ఈ కొత్త, డానిష్ డిజైన్ వినియోగదారులకు Gen 6 సాంకేతికతతో కొత్త అనుభూతిని అందిస్తుందని" ఫాసిల్ గ్రూప్ EVP చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ స్టీవ్ ఎవాన్స్ తెలిపారు.

స్మార్ట్‌వాచ్‌లో 1.28-అంగుళాల టచ్‌స్క్రీన్ డిజిటల్ డిస్‌ప్లే, 8 GB స్టోరేజ్, 1GB RAM, నిరంతర ట్రాకింగ్, మెరుగైన సిగ్నల్, హార్ట్ బీట్ సెన్సార్‌ మొదలైనవి ఉన్నాయి. వినియోగదారుల కోసం కొత్త SpO2 సెన్సార్ కూడా ఉంది. ఇది రక్త ఆక్సిజన్ స్థాయిని ట్రాక్ చేస్తుంది.



Next Story

Most Viewed