దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ గెలుపుతో.. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానం!

by Web Desk |

దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ గెలుపుతో.. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానం!
X

న్యూఢిల్లీ: దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ టోర్నీలో లాట్వియన్ (యూరప్) ప్లేయర్ జెలెనా ఒస్టాపెంకో టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో రష్యన్ క్రీడాకారిణి వెరోనికా కుడెర్మెటోవాను 6-0,6-4 తేడాతో ఓడించి దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ కప్పును ఒస్టాపెంకో ముద్దాడింది.ఈ విజయంతో ఆమె తన కెరీర్‌ లో ఐదోసారి టైటిల్‌ను అందుకున్నారు. అంతేకాకుండా వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 20 నుంచి 13వ స్థానానికి ఎగబాకింది జెలెనా. 2018 తర్వతా టాప్​-20 ర్యాంకింగ్స్‌లో ఆమెకు స్థానం దక్కడం ఇదే తొలిసారి.

సింగిల్స్ విభాగంలో వెరోనికా తో తలపడిన జెలెనా 65 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించింది. వెరోనికాకు అవకాశం ఇవ్వకుండా ఒస్టాంపెకో రెచ్చిపోయి ఆడటంతో దుబాయ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ట్రోఫీ తనను వరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ వారం మొత్తం నేను చాలా బాగా ఆడానని భావిస్తున్నాను. మంచి విజయాలను అందుకున్నాను.

ఈరోజు కోసం చాలా కష్టపడ్డాను. నా దృష్టంతా ఈ మ్యాచ్​పైనే పెట్టాను. తీరా ట్రోఫీ గెలవడం చాలా ఆనందంగా ఉంది. అంతకుముందు ఈ టోర్నీలో భాగంగా జరిగిన మిక్స్‌డ్​ డబుల్స్​ఫైనల్‌లో ఉక్రెయిన్‌కు కిచెనోక్ (Kichenok), ఒస్టాపెంకో జోడీ చేతిలో 6-2, 2-6, 10-7 తేడాతో సానియా మీర్జా జోడీ పరాజయం పాలైన విషయం తెలిసిందే.

Next Story