- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరికొద్ది సేపట్లో జేఈఈ మెయిన్ 2026 సెషన్-2 ఫలితాలు విడుదల
NTA జేఈఈ మెయిన్ 2026 సెషన్-2 ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను మరియు ఆల్ ఇండియా ర్యాంకులను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ 2026 సెషన్-2 ఫలితాల (JEE Main 2026 Session-2 Results)ను మరికొద్ది సేపట్లో ఎన్టీఏ (NTA) అధికారికంగా వెల్లడించనుంది. ఏప్రిల్ నెలలో జరిగిన ఈ పరీక్షల ఫైనల్ ఆన్సర్ కీ (Final Answer Key) తో పాటు, అభ్యర్థుల స్కోర్‌కార్డులు, ఆల్ ఇండియా ర్యాంకులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సెషన్-1, సెషన్-2లలో విద్యార్థులు సాధించిన అత్యుత్తమ పర్సంటైల్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను ఖరారు చేస్తారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది పోటీ విపరీతంగా ఉండటంతో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష (JEE Advanced exam)కు అర్హత సాధించే కటాఫ్ పర్సంటైల్ గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఫలితాల్లో టాప్ 2.5 లక్షల ర్యాంకుల్లో నిలిచిన అభ్యర్థులు ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు. గతంలో దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించి సత్తా చాటగా, తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మరోసారి టాపర్లుగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.






