పరీక్ష రాసి వస్తుండగా బైక్ అదుపుతప్పి..

by Vinod kumar |

దిశ, మహాదేవపూర్: ద్విచక్ర వాహనం - Jayashankar Bhupalpally road accident in Mahadevpur zone

పరీక్ష రాసి వస్తుండగా బైక్ అదుపుతప్పి..
X

దిశ, మహాదేవపూర్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నారం గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు నీర్ల మనోహర్, బెల్లంపల్లి రాకేశ్ లు.. మహాదేవపూర్ మండల కేంద్రంలో పరీక్ష రాసి వస్తుండగా.. కుదురు పల్లి అటవీ ప్రాంతంలో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిద్దరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత అక్కడి డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారు.

Next Story