- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అజ్ఞాతంలోనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. విచారణకు పిలిచే యోచనలో జనసేన అధిష్టానం
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar)పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. బాధితురాలు వరుసగా వీడియోలు విడుదల చేస్తూ సంచలన విషయాలు బయటపెడుతుండటంతో ఈ వివాదం ముదురుతోంది. మరోవైపు ఎమ్మెల్యే తమపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్‌గా ఓ వీడియోను విడుదల చేసి అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే జనసేన (Janasena) పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నది. విచారణకు పిలిపించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, లీగల్ ఓపినియన్ తీసుకున్నాకే ఎమ్మెల్యే శ్రీధర్ బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
కాగా, ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి ఎమ్మెల్యే శ్రీధర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏడాదిన్నర కాలంగా తనను వేధించారని, ఐదుసార్లు గర్భస్రావం చేయించారని ఆమె వాపోయారు. తాను సంక్రాంతి సమయంలోనే సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు కూడా నారావారిపల్లెలో అర్జీ ఇచ్చానని ఆమె వెల్లడించారు. అయితే, తనపై వస్తున్న ఆరోపణలు ముమ్మాటికీ రాజకీయ కుట్రని అరవ శ్రీధర్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ‘డీప్ ఫేక్’ (Deep Fake) అని, తనను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా నిజానిజాలు తేల్చేందుకు టి.శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీసీ వరుణ్‌లతో త్రిసభ్య కమిటీని నియమించారు.






