ప్రారంభమైన జల్లికట్టు సంబరాలు.. భారీ బందోబస్తు మధ్య కొనసాగుతున్న పోటీలు

by Malleboina Mahesh |

తమిళనాడు సంప్రదాయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే జల్లికట్టు, దాదాపు రెండు వేల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒక వీర క్రీడ. ప్రాచీన కాలంలో 'ఏరు తవుదల్' (ఎద్దును కౌగిలించుకోవడం) అని పిలిచే ఈ క్రీడ, కాలక్రమేణా 'జల్లికట్టు'గా రూపాంతరం చెందింది.

ప్రారంభమైన జల్లికట్టు సంబరాలు.. భారీ బందోబస్తు మధ్య కొనసాగుతున్న పోటీలు
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు సంప్రదాయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే జల్లికట్టు, దాదాపు రెండు వేల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒక వీర క్రీడ. ప్రాచీన కాలంలో 'ఏరు తవుదల్' (ఎద్దును కౌగిలించుకోవడం) అని పిలిచే ఈ క్రీడ, కాలక్రమేణా 'జల్లికట్టు'గా రూపాంతరం చెందింది. ఈ పేరు వెనుక ఒక ఆసక్తికరమైన అర్థం ఉంది. తమిళనాడులో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించే ప్రసిద్ధ జల్లికట్టు పోటీలు నేడు మదురై జిల్లాలోని అవనీయపురం లో ఘనంగా ప్రారంభమయ్యాయి. తమిళ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకను చూసేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సుమారు 2,000 మందికి పైగా సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 1,000 ఎద్దులు, వందలాది మంది మాల్లాలు (బుల్ టేమర్స్) ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే అవనియాపురంలో పోటీలు ప్రారంభమైన కొద్దిసేపటికే తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 'వాడివాసల్' (ఎద్దులు వచ్చే ద్వారం) నుంచి బయటకు వచ్చిన ఒక ఎద్దు ఒక్కసారిగా అదుపు తప్పి జనాలపైకి దూసుకొచ్చింది. ఈ హఠాత్పరిణామంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఎద్దు దాడిలో పలువురు మాల్లాలకు, వీక్షకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే అక్కడే సిద్ధంగా ఉన్న 108 అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గ్యాలరీ వద్ద ఉన్న వారిని క్రమబద్దీకరిస్తున్నారు.

Next Story