కాంగ్రెస్.. జీవన్ రెడ్డి ఇంటి పార్టీ కాదు: సంజయ్

by Gantepaka Srikanth |

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.

కాంగ్రెస్.. జీవన్ రెడ్డి ఇంటి పార్టీ కాదు: సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ జీవన్ రెడ్డి ఇంటి పార్టీ కాదు.. పదే పదే తనపై విమర్శలు చేయడం సరికాదు అని అన్నారు. ఫిరాయింపులపై మాట్లాడే హక్కు జీవన్ రెడ్డికి ఏమాత్రం లేదని మండిపడ్డారు. జగిత్యాల అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు, అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల మున్సిపల్ ఎన్నికల సీట్ల పంపిణీ విషయంలో జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో సంజయ్ జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇవాళ సంజయ్ మాట్లాడుతూ జీవన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. మున్సిపల్ ఎన్నికల వేళ ఇరు నేతల మధ్య వివాదం తారా స్థాయికి చేరడం కాంగ్రెస్ నేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. అధిష్టానం కలుగజేసుకుని సమస్యను సర్దుమణిగేలా చూడాలని పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తులు చేస్తున్నారు.

Next Story