- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జబల్‌పుర్ పడవ ప్రమాదం వీడియో ఫుటేజ్.. ప్రయాణికుల హాహాకారాలు
జబల్‌పుర్ నర్మదా నదిపై జరిగిన ఘోర పడవ ప్రమాదంలోమానవ తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పుర్ సమీపంలోని నర్మదా నదిపై ఉన్న బర్గీ జలాశయంలో ఘోర పడవ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందగా.. 28 మందిని రక్షించారు. అయితే పడవ ప్రమాదం కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదని, అధికారుల బాధ్యతారాహిత్యం, భద్రతా లోపాలకు నిలువుటద్దంగా నిలిచింది. ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం సుమారు 6:15 గంటల సమయంలో, సుమారు 40 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న క్రూయిజ్ బోట్ హఠాత్తుగా వచ్చిన పెను గాలులు, భారీ అలలు బోటును తాకడంతో పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురై ఒకేసారి బోటు పైభాగానికి చేరుకోవడంతో బ్యాలెన్స్ తప్పి నీరు లోపలికి చేరి బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 9 మంది మరణించగా, అందులో ఒక చిన్న బాబు కూడా ఉండటం హృదయవిదారకం. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో ఒక తల్లి తన బిడ్డను కాపాడుకునే ప్రయత్నంలో బిడ్డను గట్టిగా హత్తుకునే ప్రాణాలు విడిచిన దృశ్యం అక్కడి వారిని కలచివేసింది.
మానవ తప్పిదాలే..
అయితే, ఈ ప్రమాదంలో మానవ తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తుఫాను హెచ్చరికలు ఉన్నప్పటికీ పడవను నీటిలోకి అనుమతించడం ఒక తప్పిదమైతే, ప్రయాణికులు బోటు ఎక్కగానే వారికి లైఫ్ జాకెట్లు అందించకపోవడం అతిపెద్ద నేరం. బోటు మునిగిపోతున్న సమయంలో సిబ్బంది లైఫ్ జాకెట్లు ఉన్న మూటలను విప్పడానికి ప్రయత్నించారని, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ప్రాణాలతో బయటపడిన బాధితులు కన్నీటితో ఆరోపిస్తున్నారు. అలాగే ప్రమాదంపై సమాచారం అందించినప్పటికీ సహాయక బృందాలు చాలా ఆలస్యంగా అక్కడికి చేరుకోవడం కూడా మృతుల సంఖ్య పెరిగేందుకు కారణం అయిందని తెలుస్తోంది.
స్థానిక మత్స్యకారులు, రైతులు వెంటనే స్పందించి 15 మందికి పైగా ప్రాణాలను కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, బాధ్యులైన పైలట్ మహేష్ పటేల్, సహాయకుడు ఛోటేలాల్, టికెట్ ఇన్చార్జ్ బ్రిజేంద్రలను విధుల్లోంచి తొలగించి, బోట్ క్లబ్ మేనేజర్ సునీల్ మరావిని సస్పెండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వాటర్ స్పోర్ట్స్, మోటార్ బోట్ సేవలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించడంతో పాటు, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. వర్షం కారణంగా మిగతా వారి మృతదేహాల గాలింపు చర్యలకు ఆలస్యం అవుతోందని సహాయక బృందాల అధికారులు తెలియజేసారు. వీడియో






