మళ్లీ ఫెయిలైన ఇటలీ.. వరుసగా రెండోసారి..

by Javid Pasha |

దిశ, వెబ్‌డెస్క్: ఎఫ్ఐఎఫ్ఏ పోటీల్లో వరుస నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన దేశం ఇటలీ.. Latest Telugu News..

మళ్లీ ఫెయిలైన ఇటలీ.. వరుసగా రెండోసారి..
X

దిశ, వెబ్‌డెస్క్: ఎఫ్ఐఎఫ్ఏ పోటీల్లో వరుస నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన దేశం ఇటలీ. ప్రత్యర్థులకు ముచ్చెటమలు పట్టించే ఆటతీరుతో ఇటలీ జట్టు అందరినీ ఆకట్టుకుంది. కానీ గత కొన్నేళ్లుగా మాత్రం ఇటలీ జట్టు తన అభిమానులను తీవ్ర నిరాశ పరుస్తోంది. కనీసం ఎఫ్ఐఎఫ్ఏ ఛాంపియన్‌ షిప్‌కు క్వాలిఫై కూడా కాలేక పోతోంది. ఈ ఏడాది ఛాంపియన్ షిప్‌కు ఇటలీ జట్టు క్వాలిఫై కూడా కాలేక పోయింది. ఉత్తర మెసెడోనియాతో జరిగిన క్వాలిఫైర్స్‌ సెమీఫైనల్స్‌లో 0-1తో ఇటలీ ఓడిపోయింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇటలీ పేలవ ప్రదర్శన కనబరిచింది. దీంతో ఇటలీ వరుసగా రెండో సారి క్వాలిఫైరస్స్‌లో ఓడి ఇంటిబాట పట్టింది. దీనిపై తాజాగా ఇటలీ జట్టు కెప్టెన్ జార్జియా చిల్లిని స్పందించాడు. 'మనమంతా దారుణంగా ఓడిపోయాం. కానీ మనమంతా మళ్లీ తిరిగి ప్రారంభించాలి' అని అన్నాడు.

Next Story